

జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం ఎస్టీ కమిషన్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును అల్లూరి జిల్లా చింతపల్లికి చెందిన గిరిజన సంఘ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన గ్రామాల్లో భూ సమస్యలు, పాఠశాల సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే గిరిజన గ్రామాల్లో పర్యటిస్తానని శంకర్రావు తెలిపారు.