Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాల నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, దేశ రాజధాని అయిన ఢిల్లీ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు మక్కువ చూపారన్నారు. ఢిల్లీ లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని దొరబాబు అన్నారు. ఢిల్లీలో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఫలితాలను బట్టి బీజేపీకు ఘన విజయం తధ్యమై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సుస్తిర పాలనతోపాటు శాంతిభద్రతల స్థాపన, అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు అన్నారు