Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955

ఇకపై ఏటా జనవరి 18 నుంచి 23 వరకు చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు.. ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా కొండవీడు ఉత్సవాలు : ప్రత్తిపాటి.

7వ తేదీ తొలిరోజు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ : ప్రత్తిపాటి.

ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసేవరకు కొండపై ప్రత్యేక టెంట్ లలో పర్యాటకుల రాత్రి బసకు ఏర్పాట్లు : ప్రత్తిపాటి.

కొండవీడు వైభవం. చరిత్ర, గొప్పతనం తెలిపేలా ప్రత్యేక గీతావిష్కరణ.. 5 వ తేదీన ప్రత్యేక కర్టెన్ రైజర్ : ప్రత్తిపాటి.

కోటకు వచ్చే మార్గంలో చౌడవరం వద్ద రూ.220 కోట్ల అంచనా వ్యయంతో గతంలో చంద్రబాబు హాయాంలో నిర్మించాలనుకున్న టన్నెల్ పనులు ఈ ఏడాది ప్రారంభమయయ్యేలా చూస్తాం : ప్రత్తిపాటి. కొండవీడు ఉత్సవాల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులతో కలిసి కోటను పరిశీలించి అక్కడే సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి.

ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

8వ తేదీన జబర్దస్త్ బృందంతో వినోద కార్యక్రమం.. గాయని గీతామాధురితో సంగీత విభావరి, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు : కృతికా శుక్లా.

కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను గత ప్రభుత్వం విస్మరించిందని, గతంలో చంద్రబాబునాయుడి ముఖ్యమంత్రిత్వంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయని, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మాజీమంత్రి ప్రత్తిపాటి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం చారిత్రక ప్రదేశంలోనే సమీక్ష నిర్వహించారు. కొండవీడును సందర్శించిన మాజీమంత్రి, జిల్లా కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఇరువురూ విలేకరులతో మాట్లాడారు.

తొలిరోజు ఉత్సవాల ప్రత్యేక అతిథి పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్

ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు హెరిటేజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ప్రత్తిపాటి చెప్పారు. ఈ ఉత్సవాల తొలిరోజున ప్రత్యేక అతిథిగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ హాజరవుతారని చెప్పారు. అలానే రెండోరోజు మరో ఇద్దరు మంత్రులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, వారి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి పెమ్మసానితో సంప్రదిస్తున్నామని, ఆయన కూడా వచ్చేలా చూస్తామన్నారు.

ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసేవరకు కొండపై ప్రత్యేక టెంట్ లలో పర్యాటకుల రాత్రి బసకు ఏర్పాట్లు

కొండవీడు కోట కేంద్రంగా శ్రీకృష్ణదేవరాయలు, రెడ్డిరాజులు పాలన సాగించారని, ఆనాటి ఘన కీర్తికి అద్దం పట్టేలా, నాటి చరిత్ర..వైభవం నేటి తరాలకు తెలిసేలా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. తొలిరోజున ఆ గీతాన్ని విడుదల చేస్తామన్నారు. కొండవీడు కోటలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించి పురావస్తుశాఖ అనుమతులు లభించినందున కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు మరమ్మతులు చేయించనున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి వేసవి ముగిసేవరకు రాత్రిళ్లు కూడా పర్యాటకులు కోటపై బసచేసేలా ప్రత్యేక టెంట్ లు ఏర్పాటు చేయబోతున్నామని, వారికి అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లకోసం ప్రసిద్ధి చెందిన ఆహారతయారీ, సరఫరా కేంద్రాలను కూడా కోటపైనే ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టినట్టు ప్రత్తిపాటి పేర్కొన్నారు.

కొండవీడు మార్గంలో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో టన్నెల్ నిర్మాణం

కొత్తపాలెంలోకి వెళ్లే పనిలేకుండా ఊరి బయట నుంచే కొండవీడుకోటకు చేరేలా మార్గాన్ని ఏర్పాటుచేశామని, అదే విధంగా చౌడవరం నుంచి కోటకు వచ్చే మార్గంలోని 5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. ఈ టన్నెల్ రూ.220 కోట్ల అంచనావ్యయంతో నిర్మిస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించారని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. టన్నెల్ పూర్తయితే, గుంటూరు నుంచి నేరుగా కోటకు వచ్చేవారికి దూరం తగ్గి, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని ప్రత్తిపాటి తెలిపారు.టన్నెల్ నిర్మాణాన్ని 2026లో పూర్తయ్యేలా చూడాలని గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తెలియచేయడం జరిగిందని, సీఎం కూడా సానుకూలంగా స్పందించారని ప్రత్తిపాటి వివరించారు. కోటను చారిత్రక, పర్యాటక కేంద్రంగానే క…