జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 28 సెల్ 9550978955
టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాద పూర్వకంగా పరామర్శించారు.
మున్సిపల్ చైర్మన్ రఫాని బుధవారం శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స తర్వాతి జాగ్రత్తల గురించి అడిగి తెలుస్తూ, ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాం క్షించారు.శ్రీనివాసరావును పరామర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, కౌన్సిలర్ హరిత,కౌన్సిలర్ చెమిటిగంటి పార్వతి, కౌన్సిలర్ సుజాత,కౌన్సిలర్ కరుణ,మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రావుఫ్ ఉన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాల్లోనూ, మున్సిపల్ వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉండే శ్రీనివాసరావు త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజా సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


