Listen to this article

జనం న్యూస్ ; 28 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ ;

గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంచినీటి సౌకర్యం కొరకై ఆర్వో ప్లాంట్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఎంప్లాయిస్ యూనియన్ యొక్క సేవలు మరువలేనివని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాల్ రాజ్ అన్నారు. సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉద్యోగుల సహకారం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కోల రాజు, ప్రధాన కార్యదర్శి మట్టే వెంకట్ రెడ్డి, గౌరవాధ్యక్షులు గోపాలపురం శంకర్, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, ఉద్యోగులు ఆకుల హరిదాస్, బెజుగామ శివయ్య, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.