Listen to this article

జనం న్యూస్ జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన మహారాజశ్రీ కామిని వెంకటరాంప్రసాద్ చౌదరి శ్రీమతి లక్ష్మీ దంపతుల యాజమాన్యంలో గణపతి పూజతో ప్రారంభమై అభిషేకాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం అనంతరం స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అధినేతలైన శ్రీ సలాది సాయిబాబ గారి దంపతుల యాజమాన్యంలో మరియు వారి కుటుంబ సభ్యుల యాజమాన్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం కళ్యాణ దంపతులచే ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ సుమారుగా 4000 మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఈ కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు పాల్గొని గోవిందా నామస్మరణతో బొమ్మూరు వెంకటగిరి మారుమోగింది… ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శ్రీకృష్ణ పరమాత్మ గారి సారధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన వార్షిక సత్కార పండితులు కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఉపన్యాస వాచస్పతి బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు వారి బ్రహ్మత్వం లో మరియు వారిసహచర పండిత బృందంతో వైభవోపేతముగా జరిపించిరి…