Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 29.

తర్లపాడు మండలంలోని గానుగపెంట మరియు రాగసముద్రం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏడిఏ మార్కాపురం బాలాజీ నాయక్ నిర్వహించారు. కార్యక్రమంలో రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీ ఎఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నందు ప్రతి ఒక్క రైతు యూనిక్ ఐడి నెంబర్ కోసం రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. యూనిక్ ఐడి నెంబర్ లేని ఎడల కేంద్ర ప్రభుత్వం వారు అందజేసే పథకాలకు అర్హత కోల్పోతారని వారికి తెలిపారు. పొలం ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఏపీ ఎఫ్ ఆర్ లో నమోదు చేయించుకొని యూనిక్ ఐడి నెంబర్ పొందాలని తెలియజేశారు. కంది పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూపాయలు 8000 ఇస్తున్నందున రైతులు వారు సాగుచేసిన కంది పంటను రైతు సేవా కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు. రబి పంటలు ఫిబ్రవరి 20 లోపు రైతులందరూ ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసే రైతు సేవ కేంద్రం సిబ్బందికి రైతులు తప్పనిసరిగా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, విహెచ్ఎ సాయిరాం, రైతులు పాల్గొన్నారు.