Listen to this article

భీష్ముడు,దేవవ్రతుడు, కారణ జన్ముడు.అష్ట వసువులలో ఒకడు.

అధ్యక్షులు గంగపుత్ర సాయిలు,

జనం న్యూస్,జనవరి 29,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు పసుపుల సాయిలు,అధ్యక్షతన సంఘం పెద్దలతో కలిసి భీష్మ ఏకాదశిని గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మతంలో ప్రతి నెల శుక్ల పక్షం,కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత,మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి,జయ ఏకాదశిగా జరుపుకుంటారు.ఈ ఏడాది భీష్మ ఏకాదశిని 2026/01/29 న జరుపుకుంటున్నామని అన్నారు.హిందూ పంచాగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్ల పక్షం 11వ రోజున వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగారం, ప్రధాన కార్యదర్శి బాలయ్య,సభ్యులు సాయిలు,శ్రీనివాస్, లచ్చయ్య,నవీన్, సాయిలు,బాలయ్య, గంగపుత్ర కులస్తులు పాల్గొన్నారు.