

జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలో మానసిక ఒత్తిడి కారణంగా మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భార్య మృతి బాధ భరించలేక భర్త ఆత్మహత్య..మడిపల్లికి చెందిన గుండెకారి రాజేందర్ (53) తన భార్య మృతి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 06 ఫిబ్రవరి 2025 ఉదయం 10:00 గంటలకు గడ్డి మందు తాగగా, అతన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.ఆస్తి వివాదాలతో మనస్తాపం వ్యక్తి మృతి..మోత్కులగూడెం కు చెందిన పొనగంటి రమేష్ (42) కుటుంబ ఆస్తుల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న కారణంగా 29 జనవరి 2025 న గడ్డి మందు తాగారు. కరీంనగర్ గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 06 ఫిబ్రవరి 2025 రాత్రి 9:30 గంటలకు మృతి చెందారు.వ్యవసాయ నష్టంతో రైతు ఆత్మహత్య..విలాసాగర్‌కు చెందిన నెల్లి శంకరయ్య (65) గత మూడేళ్లుగా వ్యవసాయం చేస్తూ నష్టపోయి అప్పులపాలయ్యారు. దీని వల్ల తీవ్ర మనోవేదనకు గురై 06 ఫిబ్రవరి 2025 ఉదయం 7:00 గంటలకు పొలంలో గడ్డి మందు తాగారు. అతన్ని జమ్మికుంట పట్టణంలోని విజయ సాయి హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ 07 ఫిబ్రవరి 2025 ఉదయం 5:00 గంటలకు మృతి చెందారు.ఈ ఘటనలపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత ( బి ఎన్ ఎస్ ఎస్ ) సెక్షన్ 194 ప్రకారం కేసులు నమోదు చేశారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, సమాజం, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు.