

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెలలో నేపాల్ లో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు భారత జట్టుకు ఎంపికైనటువంటి నందలూరు మండల వాసి ఏలుసూరి శివకోటిని నందలూరు పోలీస్ స్టేషన్ నందు అభినందించి, అతని యొక్క క్రీడా జీవితం గురించి అడిగి తెలుసుకుని, అతనికి శుభాశీస్సులు అందజేసి, సన్మానించిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని, ఎటువంటి అవసరం ఉన్నా సరే తప్పకుండా క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ముందుంటానని ఏఎస్పి శివకోటికి తెలపడం జరిగింది.