Listen to this article

జనం న్యూస్ : 29 జనవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి ;వై.రమేష్ :

సాహిత్యం సమాజ హితమని, బాల రచయితల కలం నుండి జాలువారిన ప్రతి రచన లోకహితమని సినినటుడు, రచయిత, నిర్మాత జబర్దస్త్ లక్ష్మికిరణ్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల నందు గురువారం పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంకలనం గ్రామ కోకిల పుస్తకావిష్కరణ జరిగింది. జబర్దస్త్ లక్ష్మికిరణ్ మాట్లాడుతూ కల్మషం లేని బాలల లోకం నిత్యం పూలవనం అవుతుందన్నారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ చిన్నప్పుడే కథలు రాస్తున్న చిన్నారుల భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సుకు బాలసాహిత్యం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. గరిపల్లి అశోక్ మాట్లాడుతూ బాలల రచనలు సత్యవాక్కులని, నీతి, నిజాయితీగా బాలల రచనలు సాగుతాయన్నారు. గ్రామకోకిల సంకలన 25 మంది బాలకవులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల శ్రీలత శ్రీనివాస్, ఉపసర్పంచ్ గందె నరేష్, వరుకోలు లక్ష్మయ్య, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, మంచినీళ్ల సరస్వతీ రామశర్మ, బైతి దుర్గయ్య, పెందోట వెంకటేశ్వర్లు, మల్లముల కనకయ్య, కాల్వ రాజయ్య, పూర్ణచందర్ రావు, శ్రీశైలం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.