

జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీ తో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తానని… కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నామని చెప్పారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతోపాటుగా నరేంద్రుడి నవరత్నాలు పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు..