Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955

చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు జనతా వారధి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి బిజెపి జనతా వారధి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబందించిన సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ తెలపడం జరిగింది త్వరత గతిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, జనతా వారధి కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు, మీడియో ఇంచార్జ్ రావిక్రింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని, పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర, బిజెపి నాయకురాలు ఎలిజిబెత్ రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.