Listen to this article

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలూస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ 78 వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుదిపాల బుచ్చిరెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని గుర్తు చేశారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని, స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, మస్కే కుమారస్వామి, మారపెల్లి వరద రాజు, డీటీ రెడ్డి,బాసాని మార్కండేయ,యం డి రఫీ, తెలంగాణ జే ఏ సీ రాష్ట్ర కన్వీనర్ దామెరకొండ కొమురయ్య, మామిడి సుదర్శన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు….