

జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఒక ప్రైవేటు కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలందరూ కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలోని నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందికొండ మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన బడ్జెట్ తోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు బడ్జెట్ తీసుకువచ్చి నందికొండ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి, జి ఎల్ ఎం రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పోలేని రామచంద్రం, కాంపల్లి రామస్వామి, పల్లవోలు శీను, చంద్రమౌళి, కందగట్ల వీరయ్య, లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.