Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU)రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి ఆదినారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో నందలూరు, పెనగలూరు,కోడూరు,పుల్లంపేట,రాజంపేట, చిట్వేల్, ఓబుళవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారు చేయబడిన స్టడీ మెటీరి యల్ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఈ ఓ నాగయ్య మాట్లాడుతూ ఉపా ధ్యాయ సమస్యలతో పాటు విద్యార్థుల అభివృద్ధికి యూనియన్ లు కృషి చేయడం అభినందనీ యమని తెలిపారు.గత నెలలో రాష్ట్ర ఉపాధ్యాయ రాష్ట్ర కార్యదర్శి అల్లం అశోక్ కుమార్ కూడా ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్టడీ మెటీరి యల్ అందించారు. సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో 597 మార్కులు సాధించిన విద్యార్థులకు లక్షరూపాయలు చొప్పున నగదు ఇస్తానని ప్రకటించారు. పాటూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపా ధ్యాయు రాలు మాధవి లత మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఇచ్చిన మూడు లక్షల రూపాయల మెటీరియల్ ను చక్కగా ఉపయోగించుకుని మంచి మార్కులు తెచ్చు కోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి ని అశోక్ కుమార్ ని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎక్స్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై సుబ్రహ్మణ్యం రాజు నందలూరు మండల అధ్యక్ష కార్యదర్శులు లీలా కృష్ణయ్య లక్ష్మీకాంతమ్మ మార్కండేయ రెడ్డి జిల్లా కౌన్సిలర్లు మోహన్ రాజు షఫీ వల్ల మహేశ్వర్ బాబు నరసింహారావు సేలం సుభాష్ బాబు పాల్గొన్నారు