Listen to this article

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు అనంతరం తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భాగంగా ఈరోజు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు- పద్మ దంపతులు (గణపురం మాజీ జడ్పీటీసీ) దంపతులు వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన బరువుకు సమానంగా 71 కేజీల బంగారం(బెల్లం)ను వనదేవతలకు నైవేద్యంగా సమర్పించారు.గిరిజన సంప్రదాయం ప్రకారం బెల్లాన్ని బంగారంలా భావించి సమర్పించడం మేడారం జాతరలో ముఖ్యమైన ఆచారమని,శ్రీ సమ్మక్క – సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు…