జనంన్యూస్. 30. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు డిసిసి ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి మైక్ సెట్ (సౌండ్ బాక్స్) కొనుగోలుకు అవసరమైన ₹20,000లను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ యూత్ ప్రెసిడెంట్ తుంపల్లీ మహేందర్,గడ్కోల్ గ్రామ సర్పంచ్ లత శంకర్, కొండాపూర్ సర్పంచ్ శ్రీధర్, గోప్య తండా సర్పంచ్ సంతోష్, సర్పంచ్ శోభా జీవన్, ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సంతోష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గొల్ల లింబన్న, మామిడి రాములు, ముషీర్ నగర్ మాజీ ఎంపీటీసీ నౌసీలాల్,నిరాజ్,మోతె నవీన్, బసంత్ కొచర్ గంగారెడ్డి, రమేష్ రెడ్డి,గొల్ల శ్రీనివాస్ యాదవ్, వీడీసీ సభ్యులు మల్కి సంజీవ్, విజయ్, సంతోష్ ,యువ నాయకుడు జయరాం, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.విరాళం అందించిన వెలమ భాస్కర్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.



