

జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..
జమ్మికుంట పట్టణంలో, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,అని పెరుగని పోరాటం చేసిన, పూ దరి రేణుక శివ, గత ప్రభుత్వంలో.. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన, మేము సైతం అంటూ జమ్మికుంట పట్టణంలో, కాంగ్రెస్ జెండా పట్టుకుని, నాటి దెబ్బలకు ఓర్చుకుంటూ, పోలీస్ బెదిరింపులను అయినా సైతం లెక్క చేయకుండా, ఎన్నో పోరాటాలు చేసిన, పూదరి రేణుకకు, రెండవసారి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షత పదవి నియమించడం జరిగింది.
హైదరాబాద్ గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న,చేతుల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణానికి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని గుర్తించి జమ్మికుంట పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవి పూదరి రేణుక శివకుమార్ గౌడ్ ని నియమించారు.
ఇట్టి నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి,సత్యనారాయణ,హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు కి మా కృతజ్ఞతలు, తెలిపారు.