జనం న్యూస్ జనవరి 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రజలను ఉత్సాహవంతులని చేస్తూ తెలుగుజాతి సాంస్కృతి సంబరాలతో ఒక్కటిగా నిలిచి సాటిలేని ఉత్సవంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఏకరాత్రి ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన అనకాపల్లి గవరపాలెం శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవ రాజం* సందర్భంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ శ్రీ గౌరీ పరమేశ్వరులకి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి తరుపున పట్టు వస్త్రాలు,సారి సమర్పించి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా కమిటీ వారు శాసనసభ్యులను మేళతాళాలతో పూర్ణకుంభం తో స్వాగతం పలుకారు. అనంతరం ఆలయ కమిటీ వారు వేద ఆశీర్వచనం చేసి సాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపకను అందజేశారు… అనంతరం ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులను సూచించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీల నాగ శీను, ధర్మకర్తలు, ఆలయ ఈవో వై శ్రీధర్ , దేవస్థాన సిబ్బంది గౌరీ పరమేశ్వర్ల ఉత్సవ కమిటీ మరియు సభ్యులు పాల్గొన్నారు.


