Listen to this article

జనం న్యూస్ జనవరి 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ ఊ

విద్యార్థుల సృజనాత్మక వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయనీ శ్రీ నాగార్జున విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్ జె. కమలాకర్ రావు పేర్కొన్నారు. మాధవరం కాలనీలోని శ్రీ నాగార్జున విద్యలయ హై స్కూల్ లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ కమలాకర్ రావు, ప్రిన్సిపాల్ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని తెలియజేశారు. నర్సరీ నుండి మొదలుకొని పదోతరగతి వరకు విద్యార్థులు వివిధ రకాల వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.