జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, ఈరోజు వి బి జి రాంజీ జిల్లా కార్యశాల ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిల్డ్రన్స్ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు విచ్చేశారు, సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి ఈ బి జి రాంజీ త్రీ మెన్ నియమించడం జరిగిందని, ఈ కమిటీలు ప్రతి గ్రామంలోనూ విబిజి రాంజీ యొక్క ఉపయోగాన్ని, గ్రామాల అభివృద్ధిని, రైతులకు ఉపయోగాన్ని, ప్రజలందరికీ వివరిస్తాయని అన్నారు, ముఖ్యఅతిథి మాట్లాడుతూ విభజీ రామ్ జీ అంటే వికసిత భారత్ గ్యారంటీ పర్ రోజ్ గర్ వం ఆజీవిక మిషన్, గ్రామీణ, అని వివరణ ఇచ్చారు, గ్రామాలలో అంగన్వాడీలు నిర్వహణ, సిమెంట్ రోడ్లు వేయడం,, భవన నిర్మాణ కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, మహిళలకు నూరు శాతం పని కల్పించడం, మహిళా సాధికారత దిశగా, గ్రామ అభివృద్ధి దిశగా విబీజి రాంజీ రూపకల్పన జరిగిందని, నరేంద్ర మోడీ గ్రామీణ అభివృద్ధికి ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ విభి జి రాంజీ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇప్పుడు వరకు ఈపథకం ద్వారా నిధులను గోల్మాల్ చేసిన వ్యక్తులకి ఇది పారదర్శకంగా జరగడం వల్ల అలాంటి అవకతవకలకు తావు లేదని వాళ్లకి ఇబ్బంది కలిగి ఏవేవో మాట్లాడుతున్నారని, ఇది నూరు శాతం గ్రామీణ ప్రజలకు గ్రామాలకు చాలా ఉపయోగకరమని అన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజి వేమ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ వమ వి బి జి రాంజీ జిల్లా కన్వీనర్ సలాది వీరబాబు కొకన్వీనర్లు పివివిఎన్ రాజు, కటికిరెడ్డి తమ్మయ నాయుడు చెల్లింగి త్రినాధ రావు జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి జిల్లా ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కర్రి చిట్టిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, మైనార్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నేషా హుస్సేన్, ఇళ్ల సత్యనారాయణ, ఆర్.వి నాయుడు, జిల్లామహిళా మోర్చా అధ్యక్షురాలు వై శకుంతల, ఓబిసి మార్చ జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మణరావు, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొపనాతి దత్తాత్రేయ, చీకరమిల్లి శ్రీనివాస్, జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, గోలకోటి వెంకటరెడ్డి, కోటిపల్లి సాయిరాం 28 మండలాల అధ్యక్షులు, మరియు విబిజి రాంజీ మండలకన్వీనర్ కోకన్వీనర్లు, వివిధ శాఖలో నామినేట్ పదవులు ఉన్నవారు , సొసైటీ నీటి సంఘ దేవాలయ డైరెక్టర్స్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు




