Listen to this article

జనంన్యూస్. 31.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తితో దేశంలో సమసమాజ స్థాపనకై పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు బండారి ఐలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.2026 జనవరి 31 తేదీన సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిసభ ను నిర్వహించారు. ఈ సభలో బండారి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 25న పురుడుపోసుకుందని ఆయన తెలిపారు. దేశంలో కమ్యూనిస్టుల కృషి వల్ల అనేక రంగాల్లో మార్పులు సంభవించాయని ఆయన అన్నారు. కమ్యూనిజం అంటే ఒక మనిషి మరొక మనిషినీ దోపిడీ చేయని , శ్రమ దోపిడీ లేని సమాజమని ఆయన తెలిపారు. భారత స్వతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు క్రియాశీల పాత్ర పోషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో అర్హులైన పేదలకు మిగులు భూములు పంచాలని, దున్నేవానికి భూమి నినాదంతో ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు స్వాధీనం చేయించారని ఆయన అన్నారు. భారతదేశం వ్యవసాయక దేశమని, దేశంలో భూ సమస్య పరిష్కారం అయితే ఉపాధి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని కమ్యూనిస్టులు భావించి అనేక ఉద్యమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రజల కోసం జీవించడం, త్యాగాలు చేయడం, ప్రాణాలు అర్పించడం కేవలం కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమవుతుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్ బరి, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటం, మోడీ మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకై ఢిల్లీలో పోరాటం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్ల రద్దుకై పోరాటం ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో జరిగిందని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 సంవత్సరం విద్యుత్ ఆందోళన ఆందోళన వల్ల అనేక సంవత్సరాలు విద్యుత్ చార్జీల పెంపు ఆపబడిందని ఆయన అన్నారు. దేశంలో కమ్యూనిస్టులే లేకపోతే ఉద్యమాలు ఉండవని, మానవ సమాజాన్ని ఉన్నతీకరించడానికి కమ్యూనిస్టులు సహసంగా ముందుకు సాగుతారని జగమెరిగిన సత్యమని ఆయన అన్నారు.సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రభావం వల్ల నిజామాబాద్ జిల్లాలో వందలాది ఎకరాల భూమి పంపకం, వేలాదిమందికి ఇండ్ల స్థలాలు,
ఖలీల్ వాడి స్కూల్ గ్రౌండ్ రక్షించబడిందని, జిల్లాలో యూనివర్సిటీలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. బీడీ కార్మికుల, పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెరగడంతో, కమ్యూనిస్టుల కృషి మరువలేనిదని ఆయన అన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రక్షణ కోసం, పసుపు పరిశోధన కేంద్రం కోసం, గుట్కా నిషేధానికై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమిచ్చిందని ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమించడం , విద్య వైద్య రంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఆధారాలు చేసిందని ఆయన అన్నారు. గడ్కోల్ గ్రామ ముద్దుబిడ్డ ఎర్రజెండా కోసం తన ప్రాణాల్ని అర్పించిన చరిత్ర ఈ నేలకు ఉందని ఆయన అన్నారు. దేశంలో అన్ని సమస్యలకు పరిష్కారం శ్రమ దోపిడీ లేని సమసమాజ సాధన అని ఆయన తెలిపారు.ఈ సభలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ ఐఎఫ్టియు నిజాంబాద్ ఐయప్టీయు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ, నీలం సాయిబాబా,శివకుమార్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, రాజేశ్వర్ ,భీమ్గల్ సబ్ డివిజన్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వి బాలయ్య,
అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న, సహాయ కార్యదర్శులు జేపీ గంగాధరర్, ప్రజా సంఘాల నాయకులు దెశెట్టి సాయరెడ్డి. మచారెడ్డి నరసయ్య, దేవన్న, భారతి ,మణేమ్మ, గడ్కోల్ గ్రామ న్యూ డెమోక్రసీ నాయకులు నిమ్మల భూమేష్, సంజీవ్, గులామ్ హుస్సేన్, సాకలిగంగన్న, నర్సాగౌడ్, షారుక్, మాజీ ఎంపిటిసి సఫాయి గంగా రాం.తదితరులు పాల్గొన్నారు.