జనం న్యూస్ ఫిబ్రవరి 1కాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. ఉత్సవం సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి నూకాంబిక దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సారెను ఆలయ చైర్మన్ పీల నాగ శ్రీను, ఈవో శ్రీధర్, దేవస్థానం సిబ్బంది సమర్పించారు. గౌరీ పరమేశ్వరులను పలువురు రాజకీయ నేతలు అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. వేడుకకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఆస్కార సంఘటనలు లేకుండా పోలీసులు పటిష్టబందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు వినోదాలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు రథాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. అంబరాన్ని అంటిన జాతరను తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు చేయడంతో రహదారులు కిటకిట లాడాయి నేల వేషాలు ఆకట్టుకున్నాయి. భారీ లైటింగ్ అలంకరణ అనకాపల్లి పట్టణం మొత్తం 36 స్టేజుల ప్రోగ్రాం తో హోరెత్తించారు. దీనికి తోడు అనకాపల్లి ఉత్సవాలు రావడంతో జనం రాష్ట్ర నలుమూలల నుండి తండోపతండాలుగా జనం రావడంతో కాస్త రహదారులు తో ఇబ్బంది పడినప్పటికీ సజావుగా సాగింది.


