Listen to this article

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ప్రింటింగ్ ప్రెస్‌కు బకాయిలు చెల్లించని రెవెన్యూ శాఖ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా రైతులకు అందని కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు గతేడాది జులై నుండి నిలిచిపోయిన పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ సెప్టెంబర్ నెల నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయిన కొత్త పాస్ పుస్తకాల జారీ అయితే, ఈ పాస్ పుస్తకాలను ఇప్పటివరకు ముద్రిస్తున్న మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు రూ.2.4 కోట్ల బకాయిలు చెల్లించని రెవెన్యూ శాఖ.. దీంతో నిలిచిపోయిన పాస్ పుస్తకాల ముద్రణ దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1.06 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించకుండా నిలిచిపోయాయని సమాచారం ఈ పాస్ పుస్తకాలు ముద్రించేందుకు అవసరమైన నిధులను ప్రింటింగ్ ప్రెస్‌కు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందని చెబుతున్న అధికారులు అయితే ప్రస్తుతం పాస్ పుస్తకాలు ప్రింట్ చేస్తున్న సంస్థ కాకుండా వేరే సంస్థకు ఈ ముద్రణ బాధ్యతలు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ నుంచి ఎప్పుడో టెండర్లు పిలిచారు కానీ ఇప్పటివరకు వాటిని ఖరారు చేయకపోవడంతో అసలు ఎవరు ముద్రిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది