Listen to this article

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఫిబ్రవరి 12న జరిగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని. కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి భవన్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం పాల్గొని మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు 2026 ఫిబ్రవరి 12 న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర బిజెపి తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని జరగబోయే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు పార్లమెంటులో మంద బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అధికార యంత్రాంగం యాజమాన్యాలు సహకరించాలని కోరారుఈ సమావేశంలో టి యు సి ఐజిల్లా కార్యదర్శి చింతరేవుల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పెర్ కృష్ణ, సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ జిల్లా కార్యదర్శి వి వి నరసింహ, ఎఐటియూసి ఎల్కూర్ రంగన్న ఆశన్న గ్రామ పంచాయతీ జిల్లా అధ్యక్షుడు చంద్రాములు , సిద్దయ్య, ప్రేమ రాజ్ , భీమన్న తదితరులు పాల్గొన్నారు