జనంన్యూస్. 01. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లో రురల్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ మోహన్ పిలుపు మేరకు తెలంగాణ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడమైనది టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ సర్పంచులు. మాజీ సర్పంచ్ లు ఎంపిటిసి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యం.పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది అని హెచ్చరించారు.



