Listen to this article

బీజేపీ మండల కార్యాలయం వద్ద అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు

జనం న్యూస్ ఫిబ్రవరి 08(నడిగూడెం) 27 సంవత్సరాల అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బండారు వీరబాబు అన్నారు. భారత ప్రధాని మోదీ సమర్థవంతమైన పాలన పై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు.ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రం లో0 రాబోయే రోజులలో జరిగే ఎమ్మెల్సి, స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.అంతకు ముందు పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, మిఠాయి లు పంపిణి చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు, కళ్యాణ్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిక్షం రెడ్డి, బూత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గోపి రెడ్డి, రవి, రాముడు,మహేష్, గోపాల కృష్ణ, రవి,లక్ష్మి కాంత్ గౌడ్, గురుస్వామి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.