Listen to this article

గంగాపూర్ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు

జనం న్యూస్ పిబ్రవరి 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి జాతర ఈ నెల11 వ తేదీ నుండి 13 వ వరకు మూడు రోజులపాటు జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తో పాటు గా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఈరోజు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ పోలీస్ అధికారులకు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందితో
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారిని కలెక్టర్,ఎస్పీ దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏ.ఎస్.పి చిత్తరంజన్, డి సి ఆర్ బీ డి ఎస్ పి కరుణాకర్, రెబ్బెన ఎస్ఐ చంద్ర శేఖర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.