Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

మూసాపేట్ ఆంజనేయ నగర్, రోడ్ నెంబర్ తొమ్మిది లో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడుతూ కాలనీ ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేయాలని కోరుతూ ఆంజనేయ నగర్ సభ్యులు మహేందర్ మరియు లోకేష్ ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని, దీక్ష చేస్తున్న ఆంజనేయ నగర్ కాలనీ వాసులకు సంఘీభావం తెలుపుతూ స్వయంగా దీక్షలో కూర్చున్నారు.అనంతరం సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి పార్కు స్థల ప్రాధాన్యతను, కాలనీ ప్రజల అవసరాలను వివరించి సమస్యను పరిష్కరించే దిశగా గట్టి ప్రయత్నం చేశారు. స్పందించిన అధికారులు పార్కు అభివృద్ధి పనులు త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.అధికారుల హామీ నేపథ్యంలో దీక్ష చేపట్టిన మహేందర్, లోకేష్ తో పాటు ఇతర కాలనీ సభ్యులు పరస్పర చర్చల అనంతరం రాజేశ్వరరావు మహేందర్ మరియు లోకేష్ కు కొబ్బరి నీళ్లను అందించి నిరాహార దీక్షను విరమింపచేశారు. ప్రజల కోసం పార్కు అభివృద్ధి జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతుందని రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్, మూసాపేట్ మరియు బాలాజీ నగర్ డివిజన్ బిజెపి నాయకులు అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు,డాకయ్య, మల్లేష్ గౌడ్, జీవన్, శేఖర్ గుప్తా, వినోద్ గౌడ్,ఇ.సాయి,పిట్ల మనోహర్,పండుగ రేణుక, తదితరులు పాల్గొన్నారు.