

అచ్యుతాపురం(జనం న్యూస్):మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో గల రామాలయంలో శ్రీశ్రీశ్రీ సీతా రామచంద్రుల విగ్ర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ను ఆలయ కమిటీ వారు ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.