Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటు, పాము కాటు, కోతి కాటు మరియు తేలు కాటు చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ డాక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గారిని కోరడంతో ఈ మందులు పంపించటం జరిగిందన్నారు.ఈ మందులను నిరంతరం చల్లని ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సిన అవసరం ఉండటంతో ఫ్రీజ్ అవసరమైంది. ఈ విషయాన్ని గమనించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ స్వంత ఖర్చులతో ఫ్రీజ్ కొనుగోలు చేసి పిహెచ్‌సీకి అందజేయగా, ఇందుకు వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఫ్రీజ్‌ను మరియు అందులో భద్రపరిచిన మందులను ప్రభుత్వ డాక్టర్ గారు అధికారికంగా ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏర్గట్ల మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అవసరాన్ని బట్టి ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఇంతకు ముందు పాము కాటు, కుక్క కాటు వంటి అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం స్థానికంగానే మందులు లభించడం ఎంతో సంతోషకరమని ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగారెడ్డి, ఎర్గట్ల సర్పంచ్ ఉపేందర్ రెడ్డి,దోంచందా సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, తాళ్ళరాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, తాడ్పకల్ సర్పంచ్ స్వప్న అనిల్,నాగేంద్ర నగర్ రంజిత్, బట్టాపూర్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచులు, జిల్లా డీసీబీ ఉపాధ్యక్షుడు,ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, పిహెచ్‌సీ దవాఖాన సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.