Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 3తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపిహెచ్‌బీ కాలనీ గత మూడు సంవత్సరాలుగా చీకటి మయమైందన్న ఆరోపణలు కాలనీవాసుల నోట తరచూ వినిపిస్తున్నాయి. వీధిలైట్ల ఏర్పాటు విషయంలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించిన కేపిహెచ్‌బీ కార్పొరేటర్ వైఖరిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొనడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో కాలనీవాసులకు ఆశాకిరణంగా నిలిచారు యువ నాయకుడు గాదె శివ. ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకున్న గాదె శివ, కాలనీవాసుల సహకారంతో కేవలం మూడు రోజుల్లోనే మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వీధిలైట్ల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం గమనార్హం.ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో స్పందిస్తూ, అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు ప్రారంభింపజేయడంలో గాదె శివ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. రాజకీయ లాభనష్టాలను పక్కనబెట్టి, సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్లిన తీరుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మూడు సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యను మూడు రోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా యువ నాయకుడు గాదె శివ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇటువంటి నాయకత్వమే ప్రజలకు అవసరమని కాలనీవాసులు స్పష్టంగా చెబుతున్నారు.