జనం న్యూస్ ఫిబ్రవరి 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్
కృష్ణఅనకాపల్లి జిల్లా ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపీ సి.ఎం రమేష్ చేసిన అభ్యర్థనకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు. ఈ మేరకు ఎంపీ కి లేఖ రాస్తూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రూ.72.66 కోట్ల నిధులతో వైద్య మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. 225 వైద్య భవనాల నిర్మాణం, 205 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 15 బ్లాక్ ప్రజా ఆరోగ్య యూనిట్లు, 5 అధునాతన ఆసుపత్రులు మరియు ల్యాబ్ల ఏర్పాటు చేపట్టనున్నట్లు మంత్రి లేఖలో వివరించారు. ఎంపీ ప్రత్యేక చొరవ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చేసిన సమన్వయ ప్రయత్నాల ఫలితంగా ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానున్నట్టు ఆరోగ్య శాఖ మాత్యులు లేఖలో వివరించారు.//


