

కొనియాడిన దక్షిణాసియా బౌద్ధ బిక్షువులు
శిల్పాలను వివరించిన శివనాగిరెడ్డి
జనం న్యూస్- ఫిబ్రవరి 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్దవనం లో శనివారం అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు కలయ తిరిగి అక్కడ శిల్పాలను వీక్షించి కొనియాడారు. బుద్ధ వనములో జరిగిన అంతర్జాతీయ త్రిపీటక పఠణోత్సవంలో పాల్గొన్న 115 మంది బౌద్ధ బిక్షువులు లలో 27 మంది భారతదేశ బౌద్ధ బిక్షువులు, దక్షిణాసియా దేశాల భిక్షువులు శనివారం నాడు బుద్ధవనం ఎంట్రెన్స్ ప్లాజా నుండి ఊరేగింపుగా బయలుదేరి మహా స్తూపం లోని ఆచార్య నాగార్జున శిల్పం ,మహస్తుపాన్ని అలంకరించిన శిల్పాలు ,బుద్ధ పాదాలు, బుద్ధ చరిత వనం ,శ్రీలంక దేశం బహుకరించిన ఆవుకన బుద్ధుని శిల్పం, స్తూప వనములోని 14 నమూనా స్థూపాలను సందర్శించారు. బుద్ధవనం కన్సల్టెంట్ చరిత్రపరిశోధకులు , బౌద్ధ నిపుణులు శివనాగిరెడ్డి బౌద్ధ బిక్షులకు బుద్ధ వనంలోని వివిధ విభాగాలను అక్కడి శిల్పాల విశేషాలను వివరించారు. బుద్ధ వనంలోని సమావేశ మందిరంలో బుద్ధ వనం పై రూపొందించిన వీడియో ప్రదర్శనను వీక్షించిన అనంతరం శివనాగిరెడ్డి వారికి ఆచార్య నాగార్జున కాంస్య విగ్రహం వద్ద ఆయన రాసినటువంటి బౌద్ధ తాత్విక గ్రంథాలు, మాధ్యమిక ధన్యవాదాలు గురించి గురించి చెప్పారు. ఆ తరువాత బౌద్ధ భిక్షువులు శ్రీలంక ప్రభుత్వం బహుకరించిన గంటను మోగించి బుద్ధ వనం పర్యటనను ముగించారు. అనంతరం వీరు ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్థావరం నాగార్జున కొండను సందర్శించి అక్కడి కట్టడాలు, శిల్పాలను ఆసక్తిగా వీక్షించారు,
నాగర్జున కొండలోని బౌద్ధ ప్రదర్శనశాలలోని శిల్పాల గురించి మ్యూజియం అధికారి కమలహాసన్ వివరించగా బౌద్ధ బిక్షువులు ఆసక్తిగా ఆలకించి ఆచార్య నాగార్జునడు నడయాడిన నేలపై తాము కూడా అడుగు పెట్టడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని ఆచార్య నాగార్జున ని రచనలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయన్నారు, ఈ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార అధ్యక్షులు కశ్యప బంతే, ఆనంద బంతే, సంఘపాల బంతే ,శ్రీలంక మయన్మార్ ,లావోస్ ,కంబోడియా ,వియత్నాం ,థాయిలాండ్ దేశాల బౌద్ధ భిక్షువులు, అంతర్జాతీయ త్రిపీటక పఠనమండలి వ్యవస్థాపకురాలు వాంగ్మే డిక్షీ( అమెరికా), సభ్యులు నెల్సన్, బుద్ధవనం అధికారులు శ్యాంసుందర్రావు ,శాసన రక్షిత, రవిచంద్ర, శ్రీనివాస్ రెడ్డి ,నరసింహారావు ,స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.