జనం న్యూస్ ఫిబ్రవరి 3
చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోనేటి రోజున చిల్పిచెడ్ మండలం శీలంపల్లి గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, హైదరాబాద్ నుండి వచ్చిన అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీ ఉదయశంకర్ ఆధ్వర్యంలో రైతు పొలంబడి కార్యక్రమం నిర్వహించటం జరిగింది. శ్రీ. ఉదయ శంకర్ మాట్లాడుతూ వ్యవసాయం లో సమగ్ర సస్య రక్షణ పద్ధతులైన లోతు దుక్కులు, ఎర పంటలు, లింగకర్షక బుట్టల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బసవన్నప్ప ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విత్తన శుద్ధి గురించి చెప్పి, తర్వాత డెమో చేసి చూపించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు తమ కోసం నిర్వహించబడే ఈ పొలంబడి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఐ పి ఎం పద్దతులు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సర్పంచులు రాజేందర్ రెడ్డి అనిల్ మాజీ పి ఏసిఎస్ చైర్మన్ ధర్మారెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి అనిత గ్రామ పెద్దలు మరియు గ్రామ రైతు సోదరులు ముకుంద రెడ్డి, సంజీవ రెడ్డి,సుధాకర్ రెడ్డి,చంద్ర రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మహేందర్ రెడ్డి,రాజేందర్ రెడ్డి, కిష్ట రెడ్డి, నాగరెడ్డి,నవీన్ రెడ్డి, భాగయ్య,సంఘయ్యా,మొగులయ్యా, మాధవి, వనజ , నిర్మల తదితరుల పాల్గొన్నారు. CIPMC హైదరాబాద్ వారు, రైతులందరికీ లింగాకర్షక బుట్టలు పంపిణీ చేశారు. అలాగే ఈ రోజు జరిగిన రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో ఈ రోజు వ్యవసాయ శాఖ అధికారిక వాట్సాప్ ఛానల్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ వాటిని సబ్ స్క్రిప్షన్.. చేసుకోవడం,యూరియాను తగిన సాంద్రతలో వాడటం,యాసంగి వరిలో చీడపీడల యాజమాన్యం,సుస్థిర వ్యవసాయంలో నానో యూరియా వాడకం,ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలియజేశారు


