జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 3
తర్లుపాడు మండలంలోని పోతలపాడు కందల్లపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.కంది , మినుము పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు రైతులు తెలియజేశారు. వ్యాపారులు గ్రామాలలో క్వింటా రూ 8000 – 8200 వరకు కొనటానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ బయట మార్కెట్ ధర తక్కువ ఉన్నప్పుడు , రైతు సేవ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలంటే తప్పనిసరిగా రైతు సేవ కేంద్రం సిబ్బంది ద్వారా ఈపంట నమోదు సీఎం ఏ పిపి లో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న రైతులు ఏపీ ఏఐఎంఎస్ రైతుయాప్ ను డౌన్లోడ్ చేసుకుని, స్వయంగా ఈపంట నమోదు, మార్కెట్ ధరలు తెలుసుకునే అవకాశం ఉన్నట్లు రైతులకు తెలిపారు. కొంతమంది రైతులతో యాప్ ను డౌన్లోడ్ చేయించారు. రైతులతో కలిసి కోతకు సిద్ధంగా ఉన్న కంది , దోస పంట సాగుచేసిన పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, వీహె చ్ ఏ సాయిరాం, రైతులు పాల్గొన్నారు.



