Listen to this article

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పద్మనాభం మండల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు డిజిటలైజేషన్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) హాజరై డిజిటలైజేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమని, ప్రతి కార్యకర్త వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల ఎంపీపీ కంటుభుక్త రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ‘చిన్న శ్రీను సోల్జర్స్’ పాల్గొన్నారు.