Listen to this article

జనం న్యూస్:ఫిబ్రవరి 4 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)


తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.