బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాం సందాని గారి తరపున ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రచారంలో పాల్గొన్నారు..ప్రచారంలో భాగంగా 8వ వార్డులో ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎమ్మెల్యే గారు వార్డులోని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడడమే గాక, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, గులాం సందాని గారికి మద్దతు ఇవ్వాలని కోరారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా లాభం చేకూరుస్తున్నాయని తెలిపారు..ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు–తాగునీరు–డ్రైనేజీ వంటి పనుల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు..ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, మాట కాదు – పని చేసి చూపే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు..అందుకే 8వ వార్డు ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిలబడి, గులాం సందాని గారి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరింత బలపరిచారు..




