జనం న్యూస్ 04 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మున్సిపల్ బీ–ఫారం వ్యవహారంలో ఎమ్మెల్యే చాణిక్య వ్యూహం. గద్వాల మున్సిపాలిటీలో రాజకీయాలు ఊహించని విదంగా ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మున్సిపల్ బీ–ఫారం వ్యవహారం మొత్తం రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసే స్థాయిలో కీలకంగా మారింది. ఈ రాజకీయ పాచికల ఆటలో చివరకు భైలైనవారు ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.మున్సిపల్ బీ–ఫారం విషయంలో చక్రం తిప్పింది ఎమ్మెల్యేనే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, సరితా తిరుపతయ్యకు సంబంధించిన బీ–ఫారాలు చెల్లుబాటు కాకుండా చేయడంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలలో ‘అందవేసిన చెయ్యి’ పూర్తిగా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థులు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే, ఎమ్మెల్యే చాణిక్య నీతిని ప్రదర్శిస్తూ తన వ్యూహాన్ని అమలు చేశారని అంటున్నారు.ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ గెలవాలో తెలిసిన నాయకుడిగా ఎమ్మెల్యే మరోసారి తన రాజకీయ అనుభవాన్ని నిరూపించుకున్నారని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైన చోట వెనుకడుగు వేస్తూ, కీలక ఘట్టాల్లో మాత్రం పూర్తి ఆధిపత్యం చెలాయించే విధానమే ఈ పరిణామాలకు కారణమని చెబుతున్నారు.మొత్తానికి మున్సిపల్ రాజకీయాల్లో ఎమ్మెల్యే వ్యూహం పైచేయి సాధించిందా? రాజకీయ పాచికల్లో ప్రత్యర్థులు భైలయ్యారా? అన్న ప్రశ్నలకు నిన్న జరిగిన బి ఫారం ల వ్యవహారమే ఉదాహరణ గా చెప్పుకోవొచ్చు. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రాజకీయ చాతుర్యాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి.


