జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జీవీఎంసీ 84వ వార్డ్ కొత్తూరు నర్సింగరావుపేట ప్రాంతానికి చెందిన బాడీ బిల్డర్ మధు గత ఏడాది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ ఆంధ్రగా గెలుపొంది. ఈ ఏడాది నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యారు.ఫిబ్రవరి 1 వ తేదీన ఒరిస్సా, చత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 55_60 కేజీల క్యాటగిరిలో జాలారి మధు పోటీ చేసి తృతీయ స్థానం గెలుపొందారు, అనకాపల్లి కి తిరిగి వచ్చిన మధు కి బుధవారం కొత్తూరు నర్సింగరావుపేట లో ఉన్న నేచురల్ ఫిట్నెస్ జిమ్ సభ్యులు మరియు కోచ్ షరీఫ్, అథ్లెటిక్ ఛాంపియన్ అయిన ప్రసాద్, ఘన స్వాగతంతో వారి యొక్క జిమ్ముకు ఆహ్వానించి సత్కరించి ఘన సన్మాన ఏర్పాటు చేశారు.


