(జనం న్యూస్) 4 ఫిబ్రవరి 2026 కల్లూరు మండల రిపోర్టర్ వెంకట్ :-
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో గల మూడు నాలుగు వార్డుల బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు దాసరి చంద్రశేఖర్ మరియు బానోత్ బాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే రీతిలో గడపగడపకు తిరుగుతూ తమ పార్టీ కారు గుర్తును తెలియపరుస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ వార్డులలో గల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరి వెంట ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాటిస్తూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరితమైన హామీల గురించి ఓటర్లకు అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తూ ముందుకు సాగారు.. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముఖ్య లీలావతి మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు భరోతు రవి, జరుపల సురేష్,జరుపలవెంకటేశ్వర్లు, పిట్టల నరేందర్,రాము, మారబోయిన శ్రీనివాసరావు, రామడుగు నరేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


