Listen to this article

ముఖ్య అతిథి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై

బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో కళాశాల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభించి విద్యార్థుల కు తగు సూచనలు చేసి శిబిరాలకు పంపించారు.ఎన్. ఎస్. ఎస్ యూనిట్ 1 మహమ్మదాబాద్ గ్రామంలో నేడు ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె అశోక్ అధ్యక్షత వహించారు .మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శ్రీమతి సులోచన బాలు మరియు మాజి సర్పంచ్ రాజ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైనారు.
యూనిట్ 2 ఫతాలాపూర్ గ్రామంలో నేడు ప్రారంభమైంది.కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ అధ్యక్షత వహించగా పత్లాపూర్ సర్పంచ్ పద్మిని మారుతి మరియు ఉపసర్పంచ్ రాజ్ కుమార్ మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్బంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల దశ నుండే సేవాభావాన్ని అలవర్చుకోవడానికి, సమాజ అధ్యయనానికి, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసానికి ఎన్. ఎస్. ఎస్ ఒక చక్కని వేదిక అన్నారు. ఈ శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో పచ్చదనం – పరిశుభ్రత, మూఢ నమ్మకాలు, అంటరానితనం, మాతా -శిశు ఆరోగ్యం, మద్యపానం, ధూమపానం వల్ల కలిగే అనర్ధాలు, బాలకార్మిక వ్యవస్థ నిషేధం, ఆర్థిక అక్షరాస్యత, స్వయం సహాయక సంఘాల ఆవశ్య కత, వయోజన విద్య,స్కూల్ డ్రాప్ అవుట్స్ వంటి అంశాలపై వాలంటీర్లు వారం రోజుల ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. తమ గ్రామాన్ని ఎన్నుకోవడం ఎంతో సంతోష దాయకమని, శిబిరానికి తమ వంతు సహాయ సహకారమందిస్తామని గ్రామ సర్పంచ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , యువకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. వై. సంజీవరెడ్డి మరియు ఎ. రఘునాథ్ గార్లు మరియు కళాశాల అధ్యాపక,బృందం, గ్రామస్థులు మరియు ఎన్. ఎస్. ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.