

జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం నడిగూడెం మండలంలోని నారాయణపూరం సిరిపురం,వల్లాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంకులు, పైపులైన్లను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తో కలిసి ఎంపీఓ విజయలక్ష్మి శనివారం పరిశీలించారు. గ్రామాలలో మంచి నీటి సరఫరా పైపులను పరిశీలించి ఏమైనా లీకేజీలు ఉంటే వెంటనే రిపేరు చేసి తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యదర్శిలు పృద్వీ, సతీష్, మల్లారెడ్డి, భగీరథ సిబ్బంది వెంకన్న పాల్గొన్నారు.