Listen to this article

జనంన్యూస్.04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని తూంపల్లి గ్రామానికి చెందిన బొల్ల బోయిన మహేష్ /చిన్న మలయ్య దుబాయ్ లో ఒక కేసు విషయం లో చిక్కుకోవడంతో అతను ఇంటికి రావడానికి ఇబ్బంది ఉండడంతో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను అలాగే. జిల్లా అధ్యక్షుడు దినేష్ కూలచారినీ కలిసిన తుంపల్లి సర్పంచ్ జింక రాజేందర్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామానికి తోందరగ వచ్చేటట్లు చూడమని చెప్పడం జరిగింది. ఇరువురు సానుకూలంగా స్పందించారని సర్పంచ్ తెలియజేసారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ , రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.