Listen to this article

కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్

బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ బుధవారం 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడు తూ, అభివృద్ధే శ్రేయస్సుగా భావించి ప్రజల ముందుకు వచ్చాన ని తెలిపారు. తనను ఆశీర్వదించి 11వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల అభివృద్ధికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. 11వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల ఆశీర్వాదం, సహకారం అవసరమని వెల్లడించారు. ప్రచారంలో భాగంగా కాలనీల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిదీ పాలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, అభి వృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.