జనం న్యూస్ ఫిబ్రవరి 4
కోటబొమ్మాళి మండలం :మండలంలోని మాసాహెబ్‌పేట పంచాయతీ, కమలనాభపురం గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకు శాశ్విత ఉపాధ్యాయుడును నియమించాలని సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, హేమసుందరరాజు కోరారు. ఇటీవల ఉపాధ్యాయుడు ఉద్యోగ విరామణ పొందటం వల్ల ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల మూడు రోజులు పాటు సీఆర్‌పీతో పాఠశాలలో విద్యార్ధులకు విద్యను అందించామని ఎంఈవో`2 గోవిందరావు తెలిపారు. అయితే బుధవారం ఏ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడం వల్ల విద్యార్ధులే ఉపాధ్యాయులయ్యారు. ఈ విషయమై సర్పంచ్ ఎంఈవో`2తో సంప్రదించగా నరేద్ర అనే ఉపాధ్యాయునికి పాఠశాలకు వెళ్లమని చెప్పామని ఆయన కూడా మంగళవారం వరకు శెలవులో ఉన్నాడని ఆరోగ్య సమస్య వలన పాఠశాలకు వెళ్లలేదని ఆ ఉపాధ్యాయుడు తన దష్టికి తీసుకువచ్చాడని అయితే బుధవారం సీఆర్‌పీకి పట్టుకొని 10 గంటలకు పాఠశాలకు వెళ్లటం జరిగిందన్నారు. ఈ సమస్యను విద్యార్ధుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు. విద్యార్ధులు ఉపాధ్యాయుడు రాకపోవడంతో ఉదయం పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు.


