Listen to this article

జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్‌ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మరియు నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇంచార్జ్ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ ప్రచారంలో 19వ డివిజన్ అభ్యర్థి శ్రీ నాగోల్లా లక్ష్మి నారాయణ. 20వ డివిజన్ అభ్యర్థి శ్రీ న్యాలం రాజు. 35వ డివిజన్ శ్రీ ఎర్రం సుధీర్. 39వ డివిజన్ అభ్యర్థి శ్రీమతి జ్యోతి , 40వ డివిజన్ అభ్యర్థి సంజీవ్ , 41వ డివిజన్ అభ్యర్థి బూరుగుల వినోద్ , 42వ డివిజన్ అభ్యర్థి బెల్లల్ శశాంక్ , 43వ డివిజన్ అభ్యర్థి సోమలింగం. మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక భద్రతపై ఎంత శ్రద్ధ వహిస్తారో, అదే స్థాయిలో దేశ ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు ధైర్యం నింపి, సమర్థవంతంగా మహమ్మారిని ఎదుర్కొన్న ఘనత ప్రధాని మోడీ గారికే దక్కుతుందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్య భద్రత కోసమే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గతంలో ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేశారు. ప్రతిరోజూ వందలాది మంది నగరవాసులు ఆరోగ్య పరిరక్షణ కోసం ఇక్కడ వాకింగ్‌కు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు.“ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలం” అని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించి మన ఇందూరును మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నగరవాసులను కోరారు.