సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జనం న్యూస్ ఫిబ్రవరి 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
పట్టణం లొ గత కొంత కాలం గా జరుగుతున్న వరస దొంగతనాలు, గొలుసు దోపిడీలకు పాల్పడుతున్నా మూటని మెట్ పల్లి పోలీస్ లు చాకచక్యంగా అరెస్ట్ చేశారు, అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు, మెట్ పల్లి పట్టణంలో గత జనవరి నెల నందు వరుసగా ఆరు దొంగతనాలు జరిగినాయి. ఇట్టి వరుస ఘటనలకు సంబంధించి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, మెట్ పల్లి డీఎస్పీ శ్రీ రాములు ఆధ్వర్యంలో, మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ , ఎస్ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్ వారి ప్రత్యేక బృందాలు గా ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రత్యేక బృందాలు మెట్పల్లి, నిజామాబాద్ మరియు ఇతర ప్రాంతాలు తిరిగి, సీసీటీవీ ఫుటేజ్ మరియు డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ కొనసాగించి నిందితులకు సంబంధించి సమాచారం సేకరించినారు. ఈరోజు మెట్ పల్లి కొత్త బస్టాండ్ వద్ద పండుగ రమేష్ మరియు పల్లెపు రమేష్లను సీఐ మరియు సిబ్బంది కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బాధితురాలు వన్నెల గంగు వద్ద దొంగలించిన 3.5 తులాల బంగారు పుస్తెలతాడు మరియు ఒక ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నారు, నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు గుంజే గంగాధర్ మరియు ఒర్సు గంగమణిలను కూడా అరెస్ట్ చేయగా, గంగాధర్ వద్ద నుంచి 2 తులాల బంగారు పుస్తెలతాడు మరియు 1 తులం బంగారు చైన్ ఆలాగే
గంగమణి వద్ద నుంచి 2 తులాల బంగారు నెక్లెస్ మరియు 18 తులాల వెండి పట్టా గొలుసులు స్వాధీనం చేసుకున్నారు, నేరాల్లో పాల్గొన్న గైని కిరణ్ వద్ద నుంచి 11 తులాల వెండి పట్టా గొలుసులు, పెద్దూరు మల్లేశ్వరి వద్ద నుంచి 3 తులాల వెండి బ్రేస్లెట్ స్వాధీనం చేసుకున్నారు, అలాగే
దొంగతనపు సొత్తు కొనుగోలు చేసిన ఇందూరి రాకేష్ వద్ద నుంచి 3 తులాల బంగారు నెక్లెస్ మరియు 1 తులం బంగారు చైన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అని తెలిపారు,
మొత్తంగా 7 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు మరియు 32 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అని అన్నారు,
ఇట్టి దొంగలను చాకచక్యంగా పట్టుకున్న మెట్ పల్లి డీఎస్పీ శ్రీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు కిరణ్ కుమార్, అనిల్, నవీన్ ని మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్ లతో సత్కరించారు


